9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు

22 Dec, 2020 12:09 IST|Sakshi

ట్రాన్స్‌ట్రాయ్‌ కేసు.. వెలుగులోకి కీలకాంశాలు

సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఆ నిధులు మళ్లించిన కేసులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థపై సీబీఐ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇక విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.7వేల రూపాయల కోట్ల స్కాంకు తెరలేపిన రాయపాటి కంపెనీ.. తన వద్ద పనిచేసే సిబ్బంది పేర్లపై నకిలీ కంపెనీలు ఏర్పాటు చేశాడు. ఇక నిధులు దారి మళ్లించేందుకు ఈ కంపెనీలకు డైరెక్టర్లను సైతం నియమించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. (చదవండి: ‘అదే రాయపాటి సాంబశివరావుకు గౌరవం)

పద్మావతి, బాలాజీ, యూనిక్ ఎంటర్‌ప్రైజర్‌, రుత్విక్‌ అసోసియేట్‌ వంటి నకిలీ కంపెనీల పేరుతో రాయపాటి 7వేల కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడ్డాడు. 9 నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి కెనరా బ్యాంక్‌తోపాటు మరో 9 బ్యాంక్‌ల నుంచి.. 9వేల కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు తెలిసింది. ఈ క్రమంలో ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, సతీష్‌పై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

మరిన్ని వార్తలు