సుశాంత్‌ మృతిపై సీబీఐ విచారణ ప్రారంభం

7 Aug, 2020 02:01 IST|Sakshi

న్యూఢిల్లీ:  బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణను బిహార్‌ పోలీసుల నుంచి గురువారం సీబీఐ స్వీకరించింది. ఎస్పీ నుపుర్‌ ప్రసాద్‌ నేతృత్వంలో డీఐజీ గగన్‌దీప్‌ గంభీర్, జాయింట్‌ డైరెక్టర్‌ మనోజ్‌ శశిధర్‌ పర్యవేక్షణలో సీబీఐ ఈ కేసును విచారించనుంది. డీఐజీ గగన్‌దీప్, జేడీ మనోజ్‌ గుజరాత్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు.

సుశాంత్‌ స్వరాష్ట్రమైన బిహార్‌లో ఇప్పటికే పోలీసులు సుశాంత్‌ తండ్రి ఫిర్యాదుపై ఆయన ప్రియురాలిగా భావిస్తున్న రియా చక్రవర్తిపై నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకు పురిగొల్పడం మొదలైన నేరాలకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, సుశాంత్‌ ఆత్మహత్యపై ముంబై పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటివరకు ముంబై పోలీసులు రియా చక్రవర్తి, బాలీవుడ్‌ దర్శకులు ఆదిత్యచోప్రా సహా మొత్తం 56 మందిని విచారించారు.

మరిన్ని వార్తలు