పట్టపగలే చెలరేగిపోయిన దొంగలు.. పక్కా ప్లాన్‌తో స్కూటీ లాక్‌ తీసి రూ.6 లక్షలు లూటీ!

26 May, 2022 15:43 IST|Sakshi

సాక్షి, మెదక్‌: జిల్లాలోని చేగుంట మండల కేంద్రంలో పట్టపగలే దొంగలు చెలరేగిపోయారు. మక్క రాజుపేట గ్రామానికి చెందిన చింతల రమేష్ వద్ద నుంచి రూ.6 లక్షల 70 వేలు కొట్టేశారు. ఎస్‌బీఐ బ్యాంకు నుంచి రమేష్ 6 లక్షల 70 వేల రూపాయలు తీసుకొని బయటకు వచ్చాడు. తన హోండా యాక్టీవా డిక్కీలో ఆ సొమ్ము పెట్టి లాక్‌ చేశాడు. అనంతరం సమీపంలోని హీరో షాప్‌లో పని ఉండటంతో అక్కడే రోడ్డు పక్కన బండి నిలిపి వెళ్లాడు. 

అప్పటికే రెక్కీ నిర్వహించిన దొంగలు నిముషాల వ్యవధిలో రమేష్‌ యాక్టీవా ఉన్న చోటుకి చేరుకున్నారు. సెకండ్ల వ్యవధిలో లాక్‌ ఓపెన్‌ చేసి డబ్బులున్న బ్యాగ్‌తో పరారయ్యారు. హీరో షాప్‌లోకి వెళ్లి వచ్చిన రమేష్‌ వాహనం లాక్‌ ఓపెన్‌ చేసి ఉండటంతో షాక్‌కు గురయ్యాడు. సొమ్ము కనిపించకపోవడంతో లోబోదిబోమన్నాడు. 
చదవండి👉 హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

అక్కడే ఉన్న కొందరి సూచనతో వెంటనే పోలీసులకు తన గోడువెళ్లబోసుకున్నాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన చేగుంట పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కేసు విచారిస్తున్నారు. గురువారం జరిగిన ఈ ఘరానా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి👇
ఇద్దరికీ వేరువేరు పెళ్లిళ్లు..  ప్రియుడితో​ ఇంటి నుంచి పారిపోయి
కోర్టును ఆశ్రయించిన ప్ర‌జ్ఞారెడ్డి.. పుల్లారెడ్డి కొడుకు, మనవడికి నోటీసులు జారీ

మరిన్ని వార్తలు