తెలుగు అకాడమీ స్కాం: ‘ఉద్యోగులంతా తెలుగు అకాడమీలో అందుబాటులో ఉండాలి’

3 Oct, 2021 20:26 IST|Sakshi

హైదరాబాద్‌: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ సందర్భంగా తెలుగు అకాడమీ ఉద్యోగులంతా హిమాయత్‌నగర్‌లో విచారణకు అందుబాటులో ఉండాలని సీసీఎస్‌ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా, మాజీ డైరెక్టర్‌ సోమిరెడ్డి, అకౌంట్స్‌ అధికారి రమేష్‌లను విచారణకు హజరుకావాలని సీసీఎస్‌ పోలీసులు సమాచారం అందించారు.

ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ, ఏ2 గా నిందితునిగా ఉన్న రాజ్‌కుమార్‌ల మధ్య ఉన్నసంబంధాలపై పోలీసులు ఆరా తీయనున్నట్లు సమాచారం. ఈ కేసులో వీరికి..  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రఫీకి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విచారించనున్నట్లు  తెలుస్తోంది. 

చదవండి: తెలుగు అకాడమి స్కాంలో సూత్రధారి కోసం గాలింపు

మరిన్ని వార్తలు