శ్రావణి : రోజుకో మలుపు.. గంటకో ట్విస్ట్‌

11 Sep, 2020 19:26 IST|Sakshi

ఇద్దరి మూలంగానే మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుందా?

సాక్షి, హైదరాబాద్‌ : టీవీ సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడు దేవరాజ్ అని అంతా భావించారు.. కానీ కేసు మరో మలుపు తిరిగింది. తాను అమాయకుడిని అని చెప్పుకున్న సాయి మెడకు ఉచ్చు బిగుస్తోంది. దేవరాజ్ అందించిన సాక్ష్యాలు కేసును కీలక దశకు తీసుకువెళ్లింది. సాయి, అశోక్ రెడ్డిల విచారణ తరువాత కేసులో  అరెస్ట్ పర్వం కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఒక రాధ.. ఇద్దరు కృష్ణులు సినిమాలా ఉంది శ్రావణి కేసు. మూడు రోజులుగా సాగుతున్న ఈ కేసు దర్యాప్తులో ట్విస్ట్ లమీద ట్విస్టులు బయటపడుతున్నాయి. మొదటి రెండు రోజులు దేవరాజ్ చుట్టూ తిరిగితే ముచ్చటగా మూడో రోజు సాయి వైపు మళ్లింది. పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజ్ ఈ కేసులో పోలీసులకు చాలా కీలకమైన సాక్ష్యాలు అందించాడు. హోటల్ లో గొడవ జరిగిన రోజే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

తాజాగా శ్రావణిపై సాయి దాడి చేసిన సీసీ ఫుటేజ్‌ బయటపడింది. ఆత్మహత్యకు ముందు శ్రీకన్య హోటల్‌లో శ్రావణిని దేవరాజ్‌ను కలిసేందుకు రాగా.. అక్కడే ఉన్న సాయి శ్రావణిపై దాడికి పాల్పడ్డాడు. అయితే శ్రావణి ఆత్మహత్య కేసులో ఈ సీసీ ఫుటేజ్‌ కీలకం కానుంది. ప్రస్తుతం విచారణలో భాగంగా పోలీసులు ఆ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్య కు ముందు రోజు శ్రావణి సాయి ల మధ్య జరిగిన వివాదం కూడా విచారణలో కీలకం కానుంది. మరోవైపు సాయి, దేవ్ రాజ్ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ బయటికొచ్చింది. ఆ ఆడియోలో శ్రావణి కోసం వీరిద్దరు గొడవపడ్డారు. కుటుంబ సభ్యులు, సాయి కలిసి శ్రావణి ‌బెదిరిస్తున్న సమయంలో దేవరాజ్  ఆ ఆడియోను రికార్డు చేశాడు. (ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..)

సాయి, దేవ్ రాజ్ మధ్య సంభాషణ

దేవ్ రాజ్.. సాయి నీ వళ్లే ఈ సమస్యలన్నీ
శ్రావణికి నేను కావాలి ఇది ఫైనల్ 
నువ్ శ్రావణిని సపోర్ట్ చేసేవాడివైతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకు 
కామ్ గా ఉన్న ఆ అమ్మాయిని రోడ్డు ఎక్కేలా చేశావ్
శ్రావణికి నేను కావాలి ఇది ఫైనల్ 
నువ్ శ్రావణిని సపోర్ట్ చేసేవాడివైతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకు

సాయి : ఐదేళ్లుగా నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తుంటే నువ్ ఇప్పుడు వచ్చావు
ఆ అమ్మాయి నన్ను కూడా ప్రేమించింది

దేవ్ రాజ్ : ఇప్పుడే ఆ అమ్మాయిని అడుగు ఎవరిని లవ్ చేస్తుందో?? 
శ్రావణి నువ్ ఎవరిని లవ్ చేస్తున్నావ్?? నన్ను లవ్ చేస్తున్నావా లేదా??

శ్రావణి : చేస్తున్న 

దేవ్ రాజ్ : సాయి నువ్ ఇప్పటికైనా మధ్యలో ఉండి డ్రామా చేయకు 
ఇప్పటికైనా ఆ అమ్నాయి కి ఎవరు కావాలంటే వారికే ఇచ్చి చేయండి
గొడవలు అవసరం లేదు.. సైలెంట్ గా ఉండు.. శ్రావణి ఇష్టప్రకారం జరగని

శ్రావణి తమ్ముడు శివ్‌తో దేవ్ రాజ్

ఇప్పటికైనా మీ శ్రావణికి ఏం కావాలో అది చెయ్యు
సాయి కుట్రల వల్ల ఇదంతా జరుగుతుంది
నువ్వు మీ అక్క తీసుకుని రా.. మీ అక్క మనసులో ఏం ఉందో నిరుపిస్తా.. మిమ్మల్ని ఎవరు చెడగొడుతున్నారో నిరూపిస్తా..

అయితే శ్రీ కన్య హోటల్ కి వెళ్లిన పోలీసులు సిసి ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. అందులో దేవరాజ్ పై దాడి, శ్రావణిపై చేయి చేసుకున్న వ్యవహారం స్పష్టంగా ఉంది. అంతేకాదు ఆర్ ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్ రెడ్డి తో సహజీవనం కోసం సాయి శ్రావణిని విఫరితంగా వేధించినట్లు తెలిసింది. అందుకే అడ్డుగా ఉన్న దేవరాజ్ ని అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నాలు చేశాడు సాయి అని తెలుస్తోంది. శ్రావణి దేవరాజ్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సాయి ఒక ఆడియో టేప్ బయట పెట్టాడు. అయితే ఆ వేధింపుల వ్యవహారంలోనే దేవరాజ్ ని గతంలో ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సాయి బయట పెట్టిన ఆడియో పాతదిగ గుర్తించారు. కేసు తరువాత కూడా శ్రావణి దేవరాజ్ ని ప్రేమిస్తూనే ఉంది. టిక్ టాక్ ద్వారా దేవరాజ్ బర్త్ డే రోజు శ్రావణి ప్రపోజ్ చేసింది.

వీరి కలయిక నచ్చక సాయి శ్రావణిని వేధించినట్లు దర్యాప్తులో తేలింది. నలుగురిలో కొట్టడం, ఈ విషయం ఇంట్లో చెప్పి గొడవలు రేకెత్తించడంతో శ్రావణి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. సాయి ని, నిర్మాత అశోక్ రెడ్డి ని కూడా విచారిస్తే అసలు సూత్రధారులు ఎవరు అని తేలిపోతుంది. మూడు రోజుల దర్యాప్తులో హోటల్ లో సాయి దాడి, ఇంట్లో వారి గొడవే కారణమని కేసు ఓ కొలిక్కి వచ్చింది. సాయి, అలాగే శ్రావణి ఆత్మహత్య జరిగిన రోజు సాయి దేవ్ రాజ్ శ్రావణి కోసం గొడవపడిన ఆడియో సైతం బయటపడింది. దీంట్లో శ్రావణి దేవ్ రాజ్ ను ప్రేమిస్తున్నట్లు సాయి ఎదుటే ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఉజ్వల భవిష్యత్తుతో కొనసాగాల్సిన శ్రావణి జీవితం చివరకు విషాదంగా మిగిలింది. సాయి దేవ రాజుల మధ్య నలిగిపోయి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కేసులో ప్రధానంగా శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి ఒత్తిడి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు దేవరాజ్ పోలీసులకిచ్చిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కేసులో ఇంకా సాయిని అలాగే నిర్మాత అశోక్ రెడ్డి ని శ్రావణి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించాల్సి ఉంది. ఈ విచారణ అనంతరం ఈ కేసులో అసలు నేరస్తుడిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా