గాడ్‌ఫాదర్‌ ఈవెంట్‌.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే?  

30 Sep, 2022 07:08 IST|Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: నగరంలోని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో బుధవారం జరిగిన గాడ్‌ ఫాదర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జేబు దొంగలు రెచ్చిపోయారు. కేవలం గంట వ్యవధిలోనే 300 సెల్‌ఫోన్లను అపహరించారు. దీంతో ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాట్‌బాట్‌ సేవలకు 24 గంటల వ్యవధిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
చదవండి: కట్టుకున్నవాడు ఖతం.. ప్రియుడు, కూతురితో కలిసి..   

దాదాపు 270 మందికి పైగా తమ సెల్‌ఫోన్లు అపహరణకు గురైనట్లు చాట్‌బాట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే అనంతపురం త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌కు 20,  టూటౌన్‌ పోలీసు స్టేషన్‌కు 18 రాతపూర్వక ఫిర్యాదులు అందాయి.

మరిన్ని వార్తలు