సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు.. ఇంటి బయట మహిళ.. బైక్‌పై వచ్చి ఒక్కసారిగా..

18 Sep, 2022 20:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో చైన్‌ స్నాచర్స్‌ మరోసారి రెచ్చిపోయారు. ఇంటి బయట పనిచేస్తున్న ఓ మహిళ మెడలో నుంచి 5 తులాల చైన్‌ను బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. హైదరాబాద్‌ శివారులో నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు హైమావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగులు కోసం గాలింపు చేపట్టారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
చదవండి: సినిమాను తలపించిన ఎటాక్ సీన్‌.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై వెంటపడి మరీ..

మరిన్ని వార్తలు