చూస్తుండగానే మాయం.. సీసీటీవీలో చైన్‌ స్నాచింగ్‌ దృశ్యాలు

19 Jun, 2021 20:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జగద్గిరి గుట్ట పీఎస్ పరిధి శ్రీనివాస్ నగర్‌లో చైన్ స్నాచింగ్ జరిగింది. కవిత అనే మహిళ టైలర్ షాపుకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి వెనుక నుండి ఆమెను వెంబడిస్తూ మెడలో నుండి 3.2 తులాల బంగారు గోలుసును లాక్కొని వెళ్లిపోయాడు. ఆ మహిళ అతడిని వెంబడించగా.. రోడ్డుపై మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉండడంతో దానిపై పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పీఎస్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.

చదవండి: ఏడాది కిత్రమే పెళ్లి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
జర జాగ్రత్త.. లాక్‌డౌన్‌ ఎత్తేశారని.. లైట్‌ తీసుకోవద్దు!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు