3 కేసుల్లో నేడు సీఐడీ ఎదుట బాబు హాజరు 

13 Jan, 2024 11:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: మూడు కేసుల్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం ఆ కేసుల దర్యాప్తు అధికారుల వద్ద­కు వచ్చి పూచీకత్తులు సమర్పించనున్నారు. బాబు హాయాంలో జరిగిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌), ఇసుక, మద్యం అక్రమాలపై కేసులు నమోదు చేయగా.. ఈ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

ఇందుకు సంబంధించిన పూచీకత్తులను దర్యాప్తు అధికారులకు ఆయన సమర్పించాల్సి ఉంది. ఉ. 11 గంటల తర్వాత మద్యం కేసు­లో గుంటూరు సీఐడీ కార్యాలయానికి, ఇసుక కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయానికి మధ్యా­హ్నం 3.30 గంటలకు, ఐఆర్‌ఆర్‌ కేసులో సాయంత్రం 4.20 గంటలకు తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయానికి వెళ్లి పూచీకత్తులు సమర్పించనున్నారు.

>
మరిన్ని వార్తలు