‘గణేష్‌ లేకపోతే నేను బతకలేను’

21 Nov, 2020 17:16 IST|Sakshi

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడు

ప్రియుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

సాక్షి, చిత్తూరు : పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడిని చిత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లా పలమనేరు పెద్దపంజాని మండలానికి చెందిన శ్రావణి, గణేష్‌లు గత ఆరేళ్లు ప్రేమించుకుంటున్నారు. బెంగళూరులో కలిసి సహజీవనం చేశారు. కరోనా సమయంలో గణేష్‌ సొంతగ్రామానికి వెళ్లాడు. కొద్ది రోజుల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. కొద్ది రోజుల తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్నప్రియురాలు శ్రావణి రెండు రోజులుగా ఆందోళన దిగారు. గణేష్‌ తనకు కావాలని, ఆయన లేకుంటే బతకలేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు శనివారం ఆమె వీడియో సెల్ఫీ వీడియోని మీడియాకు విడుదల చేశారు

‘నేను గణేష్ ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము. పెళ్లికి ముందు రోజు కూడా నాతో రెండున్నర గంటల సేపు మాట్లాడడం జరిగింది. నువ్వు లేకుండా నేను బతకలేను అనేసి నాతో చెప్పాడు. కానీ రాత్రికి రాత్రే ఏం జరిగిందో తెలియడం లేదు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన అమ్మనాన్నలు ఏం చెప్పి తనని పెళ్లి ఒప్పించారో అర్థం కాలేదు. నాకు గణేష్‌ కావాలి. గణేష్‌ లేకపోతే నేను బతకలేను. చావే నాకు శరణ్యం’ అంటూ శ్రావణి కన్నీంటి పర్యంతమయ్యారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు