వలపు వల.. బెజవాడలో మాయలేడీ మోసాలు

6 Jun, 2021 13:23 IST|Sakshi

ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకులకు బురిడీ

ఓ ప్రముఖ న్యాయవాది పేరుతో దందాలు

సాక్షి, విజయవాడ: వ్యాపారులను టార్గెట్‌ చేసి.. మోసాలకు పాల్పడుతున్న మాయలేడి బాగోతం విజయవాడలో వెలుగులోకి వచ్చింది. ధనవంతులకు వలపు వల విసిరి.. ఆ కిలాడీ లేడీ  వ్యాపారులను టార్గెట్ చేసినట్లు సమాచారం. ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకులకు బురిడీ కొట్టిసున్న ఆ మహిళ.. ఓ యువకుడి నుంచి 80 లక్షలు కొట్టేసింది. మోసాలకు పాల్పడుతున్న శ్రీదివ్యతో పాటు, ఆమె తమ్ముడు పోతురాజు, ఆమెకు సహకరిస్తున్న రజాక్‌పై కూడా బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయలేడీ మోసాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

మాయాలేడి చేతిలో ఇలానే మోసపోయిన పలువురి వద్ద నుంచి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఓ ప్రముఖ న్యాయవాది పేరుతో దందాలు చేస్తూ.. వివాదాల్లో ఉన్న ఆస్తులు విడిపిస్తానంటూ డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. డబ్బులు వసూలు చేశాక ఆ మహిళ ముఖం చాటేస్తోంది. నగరానికి చెందిన కార్పొరేటర్, హోటల్ యజమాని సహా పదుల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు సమాచారం.

చదవండి: నిందితుడిని పట్టించిన సీసీ ఫుటేజీలు 
బాలిక కిడ్నాప్‌ కేసు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు