ఇప్పటికే రెండు పెళ్లిళ్లు.. ప్రియురాలికి పురుగుల మందు తాగించి

23 Jul, 2021 17:13 IST|Sakshi
తెనాలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి

సాక్షి,గుంటూరు(అమృతలూరు): రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మరో అవివాహిత (22)ను ఏడాది గా మభ్యపెట్టి చివరకు పురుగుల మందు తాగించి పరారైన సంఘటన ఇంటూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెనాలి జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతూ ఇచ్చిన ఫిర్యాదు వివరాలిలా ఉన్నాయి. ఇంటూరు గ్రామానికి చెందిన దాసరి ఉమామహేశ్వరరావు (38) సుమారు పదేళ్ల కిందట వివాహం చేసుకోగా కొంతకాలానికి భార్య ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు కూడా నడిచింది. అనంతరం రెండో వివా హం చేసుకున్నాడు. అయితే తన రెండో భార్యతో కూడా గొడవలు వస్తున్నాయని అవివాహిత అయిన మౌనికకు మాయమాటలు చెప్పి ఏడాదిగా ప్రేమాయణం నడుపుతున్నాడు.

బాధితురాలు వివాహం చేసుకుందామని ఒత్తిడి చేయడంతో మన పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని, ఇద్దరం చనిపోదామని నమ్మబలికాడు. ఈ క్రమంలో బాధితురాలిని కారులో గోవాడ శివాలయం రోడ్డుకు తీసుకువచ్చాడు. సిద్ధం చేసుకున్న పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలిపి ముందుగా బాధితురాలికి తాగించాడు. ఆ మార్గంలో వస్తున్న వ్యక్తులు జంటను చూసి ప్రశ్నించగా ఉమామహేశ్వరరావు పరారయ్యాడు. విష యం తెలుసుకున్న బంధువులు కె.మౌనికను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో బాధితురాలిని అమృతలూరు ఎస్‌ఐ ఎం.వాసు విచారించారు.   సీఐ  కల్యాణ్‌రాజ్‌   కేసు  దర్యాప్తు చేస్తున్నారు.     

మరిన్ని వార్తలు