భర్తను రోకలి బండతో కొట్టి.. ఆపై బావిలో తోసిన భార్య

21 Jul, 2021 14:23 IST|Sakshi

సాక్షి, తిరువొత్తియూర(చెన్నై): భర్తను రోకలి బండతో కొట్టి బావిలో తోసి హత్య చేసిన భార్యను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తిరువారూరు జిల్లా పరవకోటై స్వామినాథన్‌ వీధికి చెందిన పాండ్యన్‌ (45), మహేశ్వరి (40) దంపతులు. పాండ్యన్‌ రోజూ మద్యం తాగి భార్యను చిత్రహింసలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో రెండు రోజులుగా పాండ్యన్‌ ఇంటికి రాకపోవడంతో బంధువులు అతని కోసం గాలించారు. ఇంటి సమీపంలోని బావి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బావిలో చూడగా పాండియన్‌ శవంగా కనిపించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. మహేశ్వరి భర్తను రోకలితో దాడి చేసి బావిలోకి తోసినట్టు తెలిసింది. 

నెల్‌లైలో మహిళ హత్య 
ఎల్‌ఐకేటీసీ నగర్‌ హౌసింగ్‌బోర్డు కాలనీ చిదంబర నగర్‌కు చెదిన కోవిల్‌ పిచ్చయ్‌ భార్య ఉష (50) మంగళవారం ఉదయం ఇంటిలో తీవ్ర గాయాలతో శవంగా పడి ఉంది. సమాచారం అందుకున్న పాలై తాలూకా పోలీసు ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ, ఎస్‌ఐ వాసుదేవన్‌ అక్కడికి చేరుకుని విచారణ చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు