యువతిని హతమార్చిన ప్రేమోన్మాది.. కొట్టిచంపిన గ్రామస్తులు!

4 Jun, 2021 11:31 IST|Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. ప్రేమోన్మాది ఓ యువతిని పాశవికంగా హతమార్చాడు. కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు అతడిని కొట్టి చంపారు. ఈ ఘటన సాంబయ్య కండ్రిగలో చోటుచేసుకుంది. చిత్తూరు నగరంలో సాంబయ్య కండ్రిగ హౌసింగ్ కాలనీలో యువకుడు చిన్న సుస్మిత అనే అమ్మాయిని ​కొన్ని రోజులుగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడు.

అతడి ప్రేమను ఆ అమ్మాయి అంగీకరించకపోవడంతో ఆమెపై ఆగ్రహం పెంచుకున్నాడు. అదే అక్కసుతో శుక్రవారం ఉదయం సుస్మిత వద్దకు వచ్చి కత్తితో పొడిచి అతి దారుణంగా హత్య చేశాడు. వెంటనే స్థానికులు ప్రేమోన్మాది చిన్నాను ఆగ్రహంతో కొట్టిచంపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా చిత్తూరు ఉలిక్కిపడింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు