స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి.. పట్టాలపై శవమై తేలిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

14 Oct, 2021 07:42 IST|Sakshi

సాక్షి, చిత్తూరు అర్బన్‌: స్టాక్‌మార్కెట్‌లో నష్టం రావడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు శ్రీనగర్‌ కాలనీకి చెందిన భరత్‌ (23) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. కరోనా నేపథ్యంలో చిత్తూరులోని తన నివాసంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ద్వారా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇటీవల స్టాక్‌మార్కెట్‌లో రూ.లక్ష వరకు పోగొట్టుకున్నాడు. దీంతో మంగళవారం ఇంటి నుంచి వెళ్లిన భరత్, బుధవారం ఉదయం బెంగళూరులోని కేఆర్‌ పురం రైల్వేస్టేషన్‌ సమీపంలో పట్టాలపై శవంగా తేలాడు. ఆత్మహత్మ గా అక్కడి పోలీసులు భావిస్తున్నారు. 

చదవండి: (ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం)

మరిన్ని వార్తలు