చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

15 Sep, 2023 08:38 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఆంబులెన్స్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తవణంపల్లె మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది.

వేలూరు నుంచి వస్తున్న కిమ్స్ హాస్పిటల్  అంబులెన్స్.. చిత్తూరు-తిరుపతి హైవే మీద ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆంబులెన్స్‌లో ఏడుగురు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వాళ్లను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు