Eluru Town: యువతిపై లైంగికదాడి.. సీఐపై తీవ్ర ఆరోపణలు

28 Dec, 2021 11:44 IST|Sakshi

వీఆర్‌కు తరలించిన ఉన్నతాధికారులు  

సాక్షి, ఏలూరు టౌన్‌: ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు పోలీసు శాఖలో అధికారుల అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఏలూరులో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఓ అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన సీఐ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించడంతో పాటు ఆమెను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. గతేడాది ఈ కేసుకు సంబంధించి యువతి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా చర్యలేమి లేకుండా చేసుకునేందుకు సీఐ తీవ్రంగా ప్రయత్నించారు.

చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే)

అయితే యువతి ఫిర్యాదుపై రాష్ట్రస్థాయి అధికారుల విచారణ నేపథ్యంలో సీఐపై వేటు తప్పదని తెలుస్తోంది. సదరు సీఐ ఇటీవల అటాచ్‌మెంట్‌పై మరో విభాగంలో పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. అయితే ఆరోపణల నేపథ్యంలో రెండు రోజుల క్రితం సీఐను వీఆర్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలో సీఐపై విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏలూరు రూరల్‌ స్టేషన్‌లో గతంలో పనిచేసిన సీఐ, ఎస్సై పై వేటు పడింది. వీరిద్దరిపై కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి.   

చదవండి: (భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. గాలిపటం గొంతుకు చుట్టుకుని​ ప్రాణం తీసింది..)

మరిన్ని వార్తలు