దుష్ప్రచారం చేసిన వ్యక్తిని విచారించిన సీఐడీ

3 Jun, 2022 04:55 IST|Sakshi

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ ఏడాది నుంచి నిలిపివేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు షేర్‌ చేసి, వైరల్‌ చేసిన వారిలో శ్రీకాకుళం జిల్లా బోరుబద్ర రామాలయం గుడి ప్రాంతానికి చెందిన ఎ.వెంకటేష్‌ను గురువారం సీఐడీ గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

ప్రైవేటు పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేసే అతను సోషల్‌ మీడియా ద్వారా పలువురికి పంపించినట్లు గుర్తించారు. దీంతో అతనికి నోటీసులు జారీ చేసినట్లు సీఐడీ గుంటూరు అధికారి ఒకరు తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అతనికి సూచించినట్లు చెప్పారు. సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేసిన పలువురిని గుర్తిస్తున్నామని వివరించారు.  

మరిన్ని వార్తలు