అభ్యంతరకర పోస్టులపై యువకుడిని ప్రశ్నించిన సీఐడీ 

10 Aug, 2021 03:34 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుమార్తెను కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన యువకుడు గనిపినేని సాయికిరణ్‌ను సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. ప్రకాశం జిల్లా దసరాజుపల్లికి చెందిన అతను ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై అభ్యంతరకర పోస్టులను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

సీఐడీ అధికారులు దీనిపై సీఆర్‌పీసీలోని 41ఏ సెక్షన్‌ ప్రకారం సాయికిరణ్‌కు నోటీసులిచ్చి, గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి పిలిపించారు. సీఎం కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులపై ప్రశ్నించారు. రెండ్రోజుల కిందట గుంటూరుకు చెందిన చేరెడ్డి జనార్దన్‌రావునూ సీఐడీ విచారించిన విషయం తెలిసిందే.    

మరిన్ని వార్తలు