ప్రియుడితో వాగ్వాదం.. యువతి ఆత్మహత్యాయత్నం

18 Feb, 2022 07:28 IST|Sakshi
బాధితురాలిని విచారిస్తున్న సీఐ తేజమూర్తి  

సాక్షి, కళ్యాణదుర్గం: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ అమ్మాయి జిల్లాకు చెందిన ఓ అబ్బాయితో ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమలో పడింది. వీరి వ్యవహారాన్ని ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టణ సీఐ తేజమూర్తి తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన సుజినకు ఏడాది క్రితం కణేకల్లు మండలం పూలచెర్లకు చెందిన నగేష్‌తో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ కొంతకాలం కల్లూరులోని ఓ సెల్‌ షో రూంలో పనిచేశారు. కొన్ని రోజులకే ఇద్దరూ ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు.

ఈ క్రమంలోనే సుజిన గురువారం ప్రియుడికి ఫోన్‌ చేసి తాను వస్తున్నట్లు చెప్పింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన ఆమె వెంటనే తన సెల్‌ ద్వారా రాయదుర్గం పోలీసులకు ఫోన్‌ చేసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన వారు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా కళ్యాణదుర్గంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు.

చదవండి: (ఫేస్‌బుక్ ప్రేమ.. ఇంటి నుంచి వెళ్లిపోయి..)

కళ్యాణదుర్గం పోలీసులను అలర్ట్‌ చేశారు. పోలీసు సిబ్బంది బాధితురాలు ఉన్న చోటుకు వెళ్లేలోపే అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే వారు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. విషయాన్ని ప్రియుడు నగేష్, అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అమ్మాయిని వారికి అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు