బాలికతో క్రికెట్‌ కోచ్‌ అసభ్యకర ప్రవర్తన..భుజాలు, ఇతర భాగాలను తాకుతూ..

22 Oct, 2021 15:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పుదుచ్చెరి: శిక్షణ కోసం వచ్చిన 16 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలపై క్రికెట్ కోచ్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. సీనియర్ క్రికెటర్, కోచ్ అయిన నిందితుడు తన వద్ద శిక్షణ తీసుకుంటున్న టీనేజర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను లైంగికంగా వేధించాడు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత క్రికెట్ అసోయేషన్ ఆఫ్ పాండిచ్చేరి (సీఏపీ)కి చెందిన ఐదుగురు ప్రతినిధులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

సీనియర్ ప్లేయర్, కోచ్ అయిన తమరైకన్నన్ వద్ద శిక్షణ తీసుకుంటున్న తనని అసభ్యంగా తాకి వేధించినట్టు మెట్టుపాళయంలోని పోలీసులకు చైల్డ్‌ లైన్ ద్వారా ఓ బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. కోచ్‌ తమరైకన్నన్ ప్రేమిస్తున్నట్టు మెసేజ్‌ చేశాడని, అంగీకరించకపోతే కోచింగ్‌ ఇవ్వనని బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది. చివరకు కోచ్‌ ఆగడాలను భరించలేని ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. అయితే బాలిక తన మీద ఫిర్యాదు ఇవ్వబోతోందన్న విషయాన్ని తెలుసుకున్న కోచ్‌ తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లాడు.

పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని ఆమెను బతిమలాడినట్లు తెలిపింది. అయినప్పటికీ అతనికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో చైల్డ్ లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించింది. దీంతో తమరైకన్నన్ సహా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోర్డులోని ఐదుగురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. 

చదవండి: స్నేహం ముసుగులో యువతులను లొంగదీసుకుని.. ఆతర్వాత

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు