గిరిజన విద్యార్థినిపై లైంగిక వేధింపులు

1 Aug, 2021 05:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నిర్వాకం

అక్కిరెడ్డిపాలెం (గాజువాక): ప్రాక్టికల్, పరీక్ష రాయడానికి వచ్చిన గిరిజన విద్యార్థినీని ఓ కాలేజీ ప్రిన్సిపాల్‌ లైంగిక వేధింపులకు గురి చేశాడు.  దీంతో ఆమె శనివారం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలివి.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం దరి మారుమూల గిరిజన తండాకు చెందిన నర్సింగ్‌ విద్యార్థిని కాకినాడలో మూడో సంవత్సరం చదువుతోంది.

ప్రాక్టికల్స్, పరీక్షల కోసం గాజువాక షీలా నగర్‌లోని మదర్‌ థెరిస్సా నర్సింగ్‌ కళాశాలకు వెళ్లాలని యాజమాన్యం సూచించింది. ఇటీవల పరీక్షలు రాయడానికి వచ్చిన ఆ విద్యార్థినీని కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం. వెంకటరావు లైంగిక వేధింపులకు గురి చేశాడు. తను చెప్పినట్లు నడుచుకోకపోతే.. పాస్‌ అవ్వకుండా చేస్తానని బెది రించాడు. ఒకే రోజు మూడుసార్లు ఒళ్లం తా మసాజ్‌ చేయించుకున్నాడని,  కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడని విద్యార్థిని వాపోయింది.  ఆమె తన సోదరుడి సాయంతో గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు ప్రిన్సిపాల్‌ వెంకటరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు