లోకేశ్‌పై ఫిర్యాదు

6 Jul, 2021 05:10 IST|Sakshi
ఫిర్యాదు చేస్తున్న నారాయణరెడ్డి తదితరులు

కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ఎన్‌.నారాయణరెడ్డి సోమవారం కర్నూలు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గడివేముల మండలం పెసరవాయిలో హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చి.. జూన్‌ 18న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐ కళా వెంకటరమణకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అవమాన పరచడమే కాకుండా, సీఎం వైఎస్‌ జగన్‌పై లోకేశ్‌ కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు