-

ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి.. దురుసు ప్రవర్తనపై కేసు

16 Jun, 2022 18:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్‌ నేత రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. గురువారం చలో రాజ్‌భవన్‌ సందర్భంగా..  పోలీసులతో ఆమె దురుసుగా ప్రవర్తించిన ఫుటేజ్‌లు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఎస్సై కాలర్‌ పట్టుకున్నారు ఆమె.

దీంతో ఎస్‌ఐ ఉపేంద్ర బాబు ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 353 కింద కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. చలో రాజ్‌భవన్‌లో పోలీసులతో దురుసు ప్రవర్తనపై. రేణుకా చౌదరిపై కేసు నమోదు అయ్యింది. ఘటన తర్వాత బలవంతంగా ఆమెను అరెస్ట్‌ చేసి గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రేణుకా చౌదరిని రిమాండ్‌కు తరలించే యోచనలో ఉన్నారు పోలీసులు. 

అయితే దురుసు ప్రవర్తన ఆరోపణలపై రేణుకా చౌదరి స్పందించారు. వెనకాల నుంచి తోసేయడంతో.. ఎస్ఐ భుజం పట్టుకున్నానని, అవమానపరిచే ఉద్దేశం లేదని ఆమె తెలిపారు. యూనిఫాంను ఎలా గౌరవించాలో తెలుసని, పోలీసుల పట్ల గౌరవం ఉందని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు