ప్రత్యర్థిని ఇరికించేందుకు పూజారి స్కెచ్‌

18 Oct, 2020 10:48 IST|Sakshi

లక్నో : రాజకీయ ప్రత్యర్థిపై పగ తీర్చుకునేందుకు గ్రామ పెద్ద ఆలయ పూజారి ఇతరులతో కలిసి నకిలీ దాడి ఘటనను సృష్టించిన ఉదంతం యూపీలోని గోండా జిల్లాలో వెలుగుచూసింది. దీనికోసం ఆయన ప్రొఫెషనల్‌ కిల్లర్‌ను నియమించుకున్నారు. ఈ ఘటనలో ఆలయ ప్రధాన పూజారి, గ్రామ పెద్ద సహా ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ దాడి ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పూజారిని కూడా డిశ్చార్జి అనంతరం అరెస్ట్‌ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

గత వారం జరిగిన ఈ దాడిలో గాయపడిన పూజారి అతుల్‌ త్రిపాఠి అలియాస్‌ సామ్రాట్‌ దాస్‌ లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి ఆలయ ప్రధాన పూజారి మహంత్‌ సీతారామ్‌దాస్‌, గ్రామపెద్ద, గాయపడిన పూజారి కుట్ర పన్నారని పోలీసులు వివరించారు. ఈ దాడి ఘటన రాష్ట్రలో కలకలం రేపడం గమనార్హం. అయోధ్య నుంచి సాధుసంతులు సైతం జిల్లాకు చేరుకుని దాడి ఘటనలో  బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ​ చేశారు. గ్రామంలోని శ్రీరాం జానకి ఆలయంలో ఈనెల 10న పూజారి దాస్‌ కాల్పుల ఘటనలో గాయపడ్డారని జిల్లా మేజిస్ర్టేట్‌ నితిన్‌ బన్సల్‌, ఎస్పీ శైలేష్‌ కుమార్‌ పాండే వెల్లడించారు.

ఈ ఘటనపై ఆలయ ప్రధాన పూజారి మహంత్‌ సీతారామ్‌దాస్‌ మాజీ గ్రామ పెద్ద అమర్‌ సింగ్‌ ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారని అమర్‌ సింగ్‌ ఆచూకీ లభ్యం కాకపోవడంతో మరో నిందితుడిని మరుసటి రోజు అరెస్ట్‌ చేశామని చెప్పారు. అయితే ఆలయానికి చెందిన భూవివాదంలో పూజారికి ప్రస్తుత గ్రామ పెద్ద వినయ్‌ సింగ్‌కు అమర్‌ సింగ్‌తో ఉన్న విభేదాల కారణంగా పూజారిపై బూటకపు దాడికి స్కెచ్‌ వేశారని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెప్పారు. పథకం ప్రకారం ఈ ఘటన జరగడంతో పూజారికి ప్రాణాపాయం లేకుడా గాయపడేలా రక్తికట్టించారని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశామని తెలిపారు. చదవండి : ఏనుగుపై యోగా : ట్రెండింగ్‌లో రాందేవ్ 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా