యువతిని పెళ్లి చేసుకుంటానని కానిస్టేబుల్‌ మోసం 

17 Jun, 2021 08:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఉండవెల్లి (జోగుళాంబ గద్వాల): స్నేహం పేరుతో ప్రేమ వ్యవహారం నడిపి యువతిని ఓ కానిస్టేబుల్‌ మోసం చేసిన సంఘటన ఇది. ఎస్‌ఐ జగన్‌మోహన్‌ కథనం ప్రకారం.. ఉండవెల్లి మండలం బస్వాపురానికి చెందిన రాజశేఖర్‌ బీచుపల్లి పదో బెటాలియన్‌లో 2014 నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో 2013 నుంచి స్నేహం చేసి ఆ తర్వాత ప్రేమ వ్యవహారం నడిపాడు.

అనంతరం వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకున్నాడు. ఇంతవరకు అతను పెళ్లి చేసుకోకపోవడంతో మోసపోయినట్టు బాధితురాలు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిపై  కేసు దర్యాప్తు జరుపుతున్నారు.   

చదవండి: జోకర్‌ యాప్స్‌.. బహుపరాక్‌

మరిన్ని వార్తలు