ఏ కష్టం వచ్చిందోగానీ.. కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య  

31 Jan, 2022 06:54 IST|Sakshi
భర్తతో లావణ్య (ఫైల్‌)

సాక్షి, తుమకూరు (కర్ణాటక): ఏ కష్టం వచ్చిందోగానీ పసిగుడ్డును వదిలేసి పోలీస్‌ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య చేసుకుంది. చిక్కనాయకనహళ్ళి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్‌ శశిధర్, భార్య లావణ్య (32)తో కలిసి క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం పెళ్లి కాగా, వీరికి ఆరునెలల మగ బిడ్డ ఉన్నాడు. ఇద్దరూ చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారే.

ఆదివారం ఉదయం శశిధర్‌ డ్యూటీకి వెళ్లినప్పుడు ఇంట్లో లావణ్య ఉరి వేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన  శశిధర్‌ ఉరికి వేలాడుతున్న భార్యను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె కన్నుమూసింది.  

వేధింపులతో యువకుడు ఆత్మహత్య
మైసూరు: టి.నరసిపుర తాలూకా వ్యాసరాజపుర గ్రామానికి చెందిన రామనాయక కుమారుడు మను (19) అనే యువకుడు యువతి కుటుంబం వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు ఒక యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పగా ఆమె తిరస్కరించింది.

ఈ విషయంలో యువతి బంధువులు సిద్దరాజు, ప్రతాప్, శాంతరాజు, భాగ్యమ్మ అనేక సార్లు పిలిచి మనును తిట్టడంతో అతడు ఆవేదన చెందాడు. దీంతో ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మను తల్లి బన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు