నగదు మాయం కేసు: రక్షకులే.. దొంగలై.. 

21 Mar, 2021 14:09 IST|Sakshi
ఉసురుమర్తి గంగాజలం- గొర్రెల గణేశ్వరరావు  

పోలీస్‌స్టేషన్‌లో నగదు మాయం

ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్‌

రూ.8.04 లక్షల నగదు రికవరీ

వీరవాసరం(పశ్చిమగోదావరి): ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులు దొంగలుగా మారారు. పోలీస్‌స్టేషన్‌లో భ ద్రపరిచిన నగదును అహరించారు. వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో నగదు మాయమైన కేసులో నిందితులు పట్టుబడ్డారు. వీరవాసరంలో జిల్లా ఎస్పీ నారాయణనాయక్‌ శనివారం విలేకరులకు వివరా లు వెల్లడించారు. వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో ఉసురుమర్తి గంగాజలం, గొర్రెల గణేశ్వరరావు (గణేష్‌) కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. మండలంలోని మ ద్యం షాపుల సిబ్బంది బ్యాంకు సెలవులు కావడంతో ఈనెల 15న సాయంత్రం మద్యం అమ్మకాల సొమ్ము రూ.8,04,330ను ట్రంకు పెట్టెలో ఉంచి సీల్‌ వేసి పోలీస్‌స్టేషన్‌ లాకప్‌ గదిలో పోలీసుల ఆధ్వర్యంలో భద్రపరిచారు. బ్యాంకులో జమ చేయ డానికి 17న ఉదయం 9 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ట్రంకు పెట్టెలో నగదు మాయమైంది. దీనిపై నరసాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి పర్యవేక్షణలో పాలకొల్లు పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ ఆంజనేయులు, రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.వెంకటేశ్వరరావు దర్యాప్తు చేపట్టారు.  

చోరీ చేసిందిలా..  
పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ఉసురుమర్తి గంగాజలం, గొర్రెల గణేశ్వరరావు (గణేష్‌) పథకం ప్రకారం చోరీకి సన్నద్ధమయ్యారు. డ్యూటీ లేని సమయంలో చోరీ చేస్తే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గంగాజలం ఈనెల 16న అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ముందుగా దాచిన ఇనుపపైపుతో లాకప్‌ గది, ట్రంకు పెట్టె తాళాలు పగులకొట్టి నగదు అపహరించాడు. అనుమానం రాకుండా వేరే లాకప్‌ గది తాళాన్ని ఈ లాకప్‌ గదికి వేశాడు. అలాగే ట్రంకు పెట్టెకు మరో తాళాన్ని వేశాడు. చోరీ సొత్తును వీరిద్దరూ పంచుకున్నారు. గణేష్‌ తన వా టా సొమ్మును వీరవాసరంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద పొదల్లో దాయగా, గంగాజలం గ్రామంలోని ప్రైవేటు కల్యాణ మండపం వద్దకు వచ్చి చెత్తలో డబ్బును దాచాడు. పోలీసులు దర్యాప్తులో భాగంగా పరారీలో ఉన్న వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని సొమ్ము రికవరీ చేశారు.  

ఇద్దరిదీ నేర ప్రవృత్తే 
మొదటి నిందితుడిగా ఉన్న ఉసురుమర్తి గంగాజలానిది పోలవరం మండలం పాత పట్టిసీమ. 2013లో చాగల్లులో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. 2020లో పాతపట్టిసీమలోని గెస్ట్‌హౌస్‌లో పేకాట ఆడుతూ ప ట్టుబడి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఇటీవల వీరవా సరం పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చాడు. రెండో నిందితుడు గొర్రెల గణేశ్వరరావుది నల్లజర్ల మండలం అనంతపల్లి. తాడేపల్లిగూడెంలో విధులు నిర్వహి స్తూ అవినీతి ఆరోపణలపై సస్పెండ్‌ అయ్యాడు. గతేడాది నుంచి వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో విధు లు నిర్వహిస్తున్నాడు. ఇద్దరిపై శాఖాపరమైన విచారణ పూర్తి చేసి డిస్మిస్‌ చేస్తామని, డ్యూటీలో అలక్ష్యంగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌పై శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నారాయణనాయక్‌ చెప్పారు.  ఏలూరు సీసీఎస్‌ డీఎస్పీ కె.పైడేశ్వరరావు ఆధ్వర్యంలో భీమవరం సీసీఎస్‌ ఇ న్‌స్పెక్టర్‌ నాగరాజు, తాడేపల్లిగూడెం సీఐ ఆకుల ర ఘు, వీరవాసరం, ఆచంట, పోడూరు, యలమంచి లి ఎస్సైలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ నారాయణనాయక్‌ చెప్పారు. 


చదవండి:
హత్య కేసు: గుర్తు తెలిపిన తాళం చెవి!  
భర్త చేష్టలతో విసుగుచెంది...

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు