గొడవ ఆపాలని​ ప్రయత్నించిన పోలీసు ముఖంపై.. 

16 Oct, 2021 17:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: రెండు పార్టీల మధ్య జరిగిన గొడవను పరిష్కరించాలని ప్రయత్నించిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ కత్తిదాడికి గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల.. ప్రకారం థానే జిల్లాలోని ఉల్‌హసన్‌నగర్‌ పట్టణానికి చెందిన సంజయ్‌ అనే వ్యక్తి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించే నరేష్‌ లెఫ్టీ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు ఎంతకూ తిరిగి ఇవ్వకపోవటంతో సంజయ్‌ను డబ్బులు త్వరగా ఇవ్వాలని నరేష్‌ ఒత్తిడి చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నరేష్‌, సంజయ్‌లు తమ మిత్రులతో ఉల్‌హసన్‌నగర్‌లో 4లో కలుసుకున్నారు. సంజయ్‌ తనతో పాటు క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న అవినాష్‌ను తీసుకువచ్చాడు. అతడు మరో మూడు నెలలు ఆగాల్సిందిగా నరేష్‌కు చెప్పాడు. దీంతో ఇంకా ఎన్ని నెలలు ఆగాలంటూ కోపంతో నరేష్ కత్తితో అవినాష్, సంజయ్‌పై దాడి చేశాడు. 

గొడవ గురించి తెలుసుకున్న తరువాత, పోలీసు కానిస్టేబుల్ గణేష్ దమాలే, ఒక సహోద్యోగితో కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు.  గణేష్‌ దమాలే ఈ గొడవను ఆపడానికి జోక్యం చేసుకున్నప్పుడు, నరేష్ అతని ముఖంపై కూడా పొడిచి, అక్కడి నుండి పారిపోయాడు. తరువాత, మరి కొందరు పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నరేష్, శశి చిక్నా అలియాస్ సుఖీ, ఓమీలపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్‌.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు

మరిన్ని వార్తలు