కోవిడ్‌ సెంటర్లలో రెచ్చిపోతున్న కామాంధులు

2 May, 2021 17:18 IST|Sakshi

భువనేశ్వర్‌ : దేశంలో కరోనా దెబ్బకి ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి.  దీంతో తమని కాపాడాలంటూ కరోనా బాధితులు హాహాకారాలు చేస్తుంటే కామాంధులు మాత్రం   మాత్రం రెచ్చిపోతున్నారు. మహిళ ఒంటిరిగా కనిపిస్తే చాలు మీద పడిపోతున్నారు. అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. 

తాజాగా ఒడిస్సా కు చెందిన కోవిడ్‌ వార్డ్‌ లో దారుణం జరిగింది. కరోనా వార్డ్‌ లో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలిపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఏప్రిల్‌ 26న కరోనా సోకి నుపాడా జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళ అడ్మిట్‌ అయ్యింది. అయితే అప్పటికే అదే ఆస్పత్రిలో చేరిన కరోనా సోకిన కామాంధుడు బాధితురాలిపై  అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో నిందితుడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు కేకలు వేసింది. బాధితురాలి కేకలు విన్న తోటి కరోనా పేషెంట్లు, ఆస్పత్రి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను రక్షించారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ‘నిందితుడు నాపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను నేను రక్షించుకునేందుకు కేకలు వేయడంతో కరోనా బాధితులు తనని రక్షించార’ని పోలీసులకు తెలిపింది. 

ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు నుపాడా పీఎస్సై సంజుక్తా బార్లా తెలిపారు. ప‍్రస్తుతం నిందితుడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం నిందితుడ్ని మరో కోవిడ్‌ సెంటర్‌ తరలించినట్లు చెప్పారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు