కరోనా సోకిన ఖైదీ ఆస్పత్రి నుంచి పరార్‌

26 Jun, 2021 12:15 IST|Sakshi
డిఫు మెడికల్ కాలేజీ ఆస్పత్రి (ఫైల్ ఫోటో)

అస్సాం: కరోనా వైరస్‌ బారిన పడిన కొందరు బాధితులు చికిత్స పొందుతూ ఆస్పత్రుల నుంచి పారిపోయిన వార్తలను చూశాం. అయితే తాజాగా కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయి చికిత్స పొందుతున్న ఓ ఖైదీ ఆస్పత్రి నుంచి పారిపోవటం అస్సాంలోని కర్బీ జిల్లాలో కలకలం రేపుతోంది.  వివరాల్లోకి వెళ్తే..   అస్సాంలోని కర్బీ జిల్లాలో ఓ ఖైదీకి కరోనా వైరస్‌ సోకడంతో గురువారం మధ్యాహ్నం డిఫు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ఆస్పత్రి వైద్యులు కోవిడ్‌ వార్డులో కరోనా చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కోవిడ్‌ వార్డులో ఆ ఖైదీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఆ ఖైదీ  కోవిడ్‌ వార్డు నుంచి పారిపోయినట్ల తెలిపారు. అతను జూన్‌ 12న డిఫు పోలీసు స్టేషన్‌ పరిధిలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అరెస్ట్‌ చేసి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను జూడిషియల్‌ కస్టడీలో ఉన్నాడు. పారిపోయిన ఖైదీ కోసం బృందాలుగా ఏర్పడి తీవ్రంగా వెతుకుతున్నట్లు పోలీసులు  తెలిపారు.
చదవండి: వ్యక్తిగత సమస్యలతో జర్నలిస్ట్‌ ఫేక్‌ డ్రామా: నొయిడా పోలీసులు

మరిన్ని వార్తలు