సాక్షి, బెంగళూరు: ప్రేమికుల ప్రైవేటు వీడియో తీసి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్న జంటను బాగలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఉషా, సురేశ్‌బాబుగా గుర్తించారు. వివరాలు.. 38 ఏళ్ల మహిళా వ్యాపారవేత్తకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరు యలహంకలోని ఓ హోటల్ కలిసేవారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆమె మేనకొడలు ఉషా తన స్నేహితుడితో కలిసి హోటల్ గదిలో ఎవరికి తెలియకుండా సీక్రెట్ కెమెరాను ఉంచారు. వారిద్దరు సన్నిహితంగా గడిపిన దృశ్యాలను వీడియో తీసి కొద్దిరోజుల తరువాత వాట్సాప్‌లో బాధితురాలికి పంపారు. వీడియో చూసిన మహిళ ఖంగుతింది.
అదే నెంబర్ నుంచి రూ. 25 లక్షల డబ్బులు ఇవ్వాలని లేదంటే వీడియోను సోషల్ మీడియాలోవైరల్ చేస్తానని మహిళను బ్లాక్ మెయిల్ చేశారు. అంతేగాక సీడీ చేసి మీ కుటుంసభ్యులకు పంపిస్తానని బెదిరించింది. అయితే డబ్బులు చెల్లించేందుకు బాధిత మహిళ నిరాకరించడంతో మేనకోడలు ఉషా కొత్త నాటకం ఆడింది. తన మొబైల్‌కు గుర్తు తెలియని నంబర్ నుంచి మీ వీడియో క్లిప్ పంపించారంటూ మరింత బెదిరింపులకు గురిచేసింది.
దీంతో వేధింపులు భరించలేక విసిగిపోయిన మహిళ జూలై 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వీడియో క్లిప్ అందుకున్న మొదటి వ్యక్తి ఉషాను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. యువతి నేరం అంగీకరించడంతో పోలీసులు ఆమె స్నేహితుడు సురేష్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు.
చదవండి: ఏడాదిన్నర కిందట పెళ్లి.. 9 నెలల బాబు.. చిన్న గొడవకే