మమ్మల్ని క్షమించండి.. మీకు భారం కాకూడదనే..

27 Sep, 2021 08:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,చెన్నారావుపేట(హైదరాబాద్‌): పిల్లలకు భారం కావొద్దని కూల్‌ డ్రింక్‌లో విష గుళికలు కలుపుకుని భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నరిగే కొంరయ్య– ఐలమ్మ దంపతులకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. ఐలమ్మ పక్షవాతంతో మంచాన పడింది.

ఆమెకు భర్త కొంరయ్య సేవలు చేస్తున్నాడు. నిత్యం ఐలమ్మకు సేవలు చేయడం ఇబ్బందిగా మారడంతో, పిల్లలకు భారం కావొద్దని శీతలపానియంలో విషపు గుళికలు కలిపి భార్యకు తాపించి, తాను తాగాడు. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన కుమారుడు శ్రీనివాస్‌కు తండ్రి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. ఇంటి తలుపులు పగులకొట్టాడు. అప్పటికే తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో కనిపించడంతో చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలించాడు. ఐలమ్మ పరిస్థితి నిలకడగా ఉండగా, కొంరయ్య పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రవిని వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

చదవండి: నన్ను బాగా చూసుకుంటానని నమ్మించి ఇల్లు అమ్మించాడు.. కానీ

మరిన్ని వార్తలు