ప్రేమజంటను మూడు రాష్ట్రాలను తిప్పి.. ముప్పుతిప్పలు పెట్టి..

17 Sep, 2021 18:58 IST|Sakshi

ఢిల్లీలో కిడ్నాప్‌.. మధ్యప్రదేశ్‌లో హత్య..

కుటుంబం కోపానికి బలైన ప్రేమజంట

భోపాల్‌: ఇద్దరు ప్రేమికులు తమ వివాహానికి కుటుంబసభ్యులను ఒప్పించలేకపోయారు. దీంతో పారిపోయి ఒకచోట ఉండగా గమనించిన కుటుంబసభ్యులు వారిని కిడ్నాప్‌నకు పాల్పడి మూడు రాష్ట్రాలు తిప్పుతూ అతి దారుణంగా హత్యకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మృతదేహాలతో క్రూరంగా ప్రవర్తించారు. ఇంతకీ వారిని హత్య చేసింది అమ్మాయి కుటుంబసభ్యులే. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? 

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లా జహంగీర్‌పూర్‌కు చెందిన యువతీయువకులు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం కుటుంబసభ్యులకు చెప్పి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారికి చెప్పడంలో విఫలమయ్యారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరని భావించి ఇంట్లో నుంచి జూలై 31వ తేదీన పారిపోయారు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు వారిపై ఆగ్రహంగా ఉన్నారు. వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గాలిస్తున్న క్రమంలో వారు ఢిల్లీలో ఉంటున్నారని తెలుసుకుని వెళ్లారు. అక్కడి ఆ కొత్త జంటను జీపులో కిడ్నాప్‌ చేశారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు సమీపంలోని బింధ్‌ ప్రాంతానికి తీసుకొచ్చి యువకుడిని దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహంపై కత్తులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన అత్రీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.
చదవండి: రాజు ఆత్మహత్యపై విచారణ: 4 వారాలు గడువిచ్చిన హైకోర్టు 

అమ్మాయిను హతమార్చి మృతదేహాన్ని రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో పడేశారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 5వ తేదీన గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే అమ్మాయి, అబ్బాయి మృతిపై ఏదో సంబంధం ఉందని పోలీసులు భావించారు. విచారణ చేపట్టగా పై విషయం వెలుగులోకి వచ్చింది. పోలీస్‌ సిగ్నల్‌ ఆధారంగా అమ్మాయి కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డట్లు గుర్తించారు. కుటుంబసభ్యులను విచారించగా నేరం అంగీకరించారు. వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు