దూరపు బంధువులు.. 8 ఏళ్ల ప్రేమ.. ఆఖరికి..

9 Apr, 2021 07:54 IST|Sakshi
కాలిపోయిన స్థితిలో యువకుడి ఇల్లు

1వ తేదీన ఇళ్ల నుంచి పరారీ

యువకుని ఇంటికి నిప్పు  

బొమ్మనహళ్లి: ప్రేమ జంట పారిపోవడంతో యువతి బంధువులు యువకుని ఇంటి పైన పెట్రోల్‌పోసి నిప్పుపెట్టారు. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ తాలూకాలోని సర్జాపుర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న గోణిఘట్టపుర గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. గోణీఘట్టపురలో ఉండే రాహుల్‌ (28) మారతహళ్లిలో రేఖ (22) దూరపు బంధువులు అవుతారు. ఇద్దరూ 8 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. ఇటీవలే రాహుల్‌ తల్లిదండ్రులు వారి ప్రేమ విషయం తెలుసుకుని రేఖతో పెళ్లి చేయాలని వారి కుటుంబ సభ్యులను కోరగా, ఒప్పుకోలేదు. ఈ సమయంలో 1వ తేదీన రాహుల్, రేఖ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు.  

పెట్రోల్‌ చల్లి నిప్పు..  
యువతి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు మారతహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారంరోజులైనా ఆచూకీ తెలియకపోవడంతో యువతి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఏదో ఒకటి తేల్చుకోవాలని రాహుల్‌ ఇంటికి వచ్చారు. అక్కడ ఇంటికి తాళం వేసి ఉంది. యువతి కుటుంబీకులు ఆ ఇంటి లోపల, బయట పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. ఇంట్లోని వస్తు సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఇళ్లంతా మసిబారింది. సర్జాపుర ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పారు. అత్తిబెలి సిఐ కే.విశ్వనాథ్, సర్జాపుర సీఐ హరీష్‌రెడ్డి పరిశీలించారు.

చదవండి: బెంగళూరులో దారుణం.. అర్ధరాత్రి జంట హత్యలు  
యువతిని పొలంలోకి ఎత్తుకెళ్లి మేకల కాపరి దారుణం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు