Canara Bank: పక్కా ప్లాన్‌.. రూ.338 కోట్లు ఎగనామం!

3 Oct, 2021 07:43 IST|Sakshi

కెనరా బ్యాంక్‌కు దంపతుల టోకరా

సాక్షి, హైదరాబాద్‌: వ్యాపార అవసరాల పేరిట కెనరా బ్యాంక్‌ను బురిడీ కొట్టించారు రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు. రూ.338 కోట్ల రుణం తీసుకుని చెల్లించకుండా ఎగ నామం పెట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది. రాజమహేంద్రవరం వై.జంక్షన్‌కు చెందిన తోట కన్నారావు, అతని భార్య వెంకట రమణ పశ్చిమ గోదావరి జిల్లా ఐ.పంగిడిలో విత్త నాల వ్యాపారం పేరుతో కృష్ణా స్టాకిస్ట్‌ అండ్‌ ట్రేడ ర్స్‌ ఏర్పాటు చేశారు. ఆ సంస్థకు డైరెక్టర్లుగా ఉంటూ.. వ్యాపార అవసరాల నిమిత్తం వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే కెనరా బ్యాంక్‌ నుంచి రెండు దఫా లుగా రూ.338 కోట్ల రుణం పొందారు. తర్వాత ఆడిట్‌ రిపోర్టులు తప్పుగా నమోదు చేసి నష్టాలు వచ్చినట్టు చూపించి రుణం ఎగవేయడానికి ప్రయ త్నించారు. దీనిపై హైదరాబాద్‌లోని కెనరా బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ టి.వీరభద్రారెడ్డి తెలంగాణ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు గత నెల 30న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు శనివారం రాజమహేంద్రవరం వచ్చినట్టు తెలుస్తోంది. 

చదవండి: Karimnagar: రూ. 10 కోట్లతో వ్యాపారి అదృశ్యం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు