నిందితుల కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ

17 Aug, 2020 08:21 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అగ్నిప్రమాదం లో పది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన కేసులో నిందితుల కస్టడీ పిటీషన్ పై నేడు కోర్టు విచారణ జరపనుంది. కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న రమేష్ ఆసుపత్రికి చెందిన కీలక వ్యక్తులు జైలులో ఉన్న రమేష్ ఆసుపత్రి సీ ఓఓ రాజగోపాల్, జనరల్ మేనేజర్ సుదర్శన్, కోఆర్డినేటర్ వెంకటేష్ కస్టడీకి పోలీసులు పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ స్వర్ణపాలెస్ హోటల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు. (రమేష్‌ వాటాదారు ‘ఆస్టర్‌’కు నోటీసులు)

ముగ్గురు నుంచి కీలక సాక్ష్యాలు రాబట్టాలని పిటీషన్లో పోలీసులు కోరారు.పోలీసులు కస్టడీ పిటీషన్ పై మూడవ అదనపు మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు నేడు విచారించనుంది. కస్టడీ నుంచి తప్పించుకునేందుకు బెయిల్ కి ప్రయత్నిస్తున్న నిందితులు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలపనున్నారు. రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం వల్లే పదిమంది ప్రాణాలు పోయాయని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు స్పష్టం చేశారు. (ఆరోగ్యశ్రీ ముసుగులో ‘రమేష్‌’ మోసాలు!)

మరిన్ని వార్తలు