యూట్యూబ్‌ వీడియోల స్పూర్తితో..

16 Jan, 2021 17:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : యూట్యూబ్‌ వీడియోల స్పూర్తితో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శనివారం ముఠాలోని ఆరుగురు సభ్యులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో  హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... ‘‘ మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. 23 బైకులు, 6 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 కేజీ వెండి, సీసీటీవీ, డీవీఆర్, 3 మొబైల్ ఫోన్స్, 35 లక్షలు సొత్తు స్వాధీనం చేసుకున్నాం. ( ఊరి చివర తోటలో ఉరి వేసుకుని..)

జగదీష్ మార్కెట్లోని గుడిలో జరిగిన దొంగ తనంతో క్లూ దొరికింది. దర్యాప్తులో భాగంగా దొరికిన క్లూస్ ఆధారంగా ఈ ముఠాను గుర్తించాము. ఆరు నెలల వ్యవధిలో 26 దొంగతనాలు చేశారు. వాజిద్ అనే వ్యక్తి గ్యాంగ్ లీడర్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ గ్యాంగ్‌లో ఉన్న అబ్దుల్ సమీర్‌పై గతంలో మర్డర్ కేసుతో పాటు ఇతర కేసులు ఉన్నాయి. ఈ కేసులో ఇద్దరు రిసీవర్‌లను కూడా అరెస్ట్ చేశాం’’అన్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు