చిక్కడపల్లి సీఐ, ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు.. సీసీఎస్‌ ఎస్‌ఐ కూడా?

24 Nov, 2021 09:16 IST|Sakshi
సీఐ శివశంకర్‌రావు, ఎస్‌ఐ నర్సింగరావు 

సాక్షి, చిక్కడపల్లి: చిక్కడపల్లి ఠాణా సీఐ పాలడుగు శివశంకర్‌రావు, అశోక్‌నగర్‌ సెక్టార్‌ ఎస్‌ఐ న ర్సింగరావులను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిరువురితో పాటు సీసీఎస్‌లో ఎస్‌ఐగా ఉన్న పి.నాగరాజుగౌడ్‌ను కూడా సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. దుష్ప్రవర్తన, అవినీతి, నైతిక అస్థిరత ఫిర్యాదుదారుడిని బెదిరించినందుకు చిక్కడపల్లి సీఐ పాలడుగు శివశంకర్‌రావు, ఎస్‌ఐ నర్సింగరావులను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.
చదవండి: అసలే చలికాలం.. రాత్రి గజగజ వణకడమే.. మరి వారి సంగతేంటి?

గత వారం చిక్కడపల్లి పీఎస్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులను సీసీఎస్‌కు వెళ్లాలని.. కేసు నమోదులో తాత్సారం చేసినట్లు తెలిసింది. బాధితులు నేరుగా సీపీని కలిసి గోడు వినిపించడంతో ఆయన విచారణ జరిపినట్లు సమాచారం. బాధితులు చెప్పింది నిజమేనని తేలడంతో సీఐ, ఎస్‌ఐతో పాటు ఈ కేసుతో సంబంధమున్న సీసీఎస్‌ ఎస్‌ఐని కూడా సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు