యువతులను ట్రాప్‌ చేసి.. కల్లు తాగించి, ఆపై..

13 May, 2021 14:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : యువతులను ట్రాప్‌ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్న హుస్సేన్ ఖాన్ అలియాస్ అలం ఖాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ గురువారం నిందితుడిని మీడియా ముందు హాజరు పరిచారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నారపల్లికి చెందిన హుస్సేన్ ఖాన్ 2008 నుండి నేరాలకు పాల్పడుతున్నాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో హుస్సేన్‌ను అరెస్ట్ చేశాం. ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. యువతులను ట్రాప్ చేసి అత్యాచారాలు చేసేవాడు. కల్లు కాపౌండ్‌కు తీసుకెళ్లి వారికి కల్లు తాగించేవాడు. అనంతరం వారిని స్కూటీ మీద బయటకు తీసుకెళ్లేవాడు.

అక్కడ అత్యాచారం చేసి వారి దగ్గర ఉన్న బంగారం దోచుకెళ్లేవాడు. మొత్తం ఇతనిపై 17 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్స్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. అతనిపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. న్యాయస్థానంలో కఠిన శిక్షలు పడేలా చూస్తాం. హుస్సేన్ అలీ ఖాన్ వద్ద నుండి 90 గ్రాముల బంగారం, 45వేల నగదు, మొబైల్ ఫోన్, హోండా యాక్టీవ్ బైక్ సీజ్ చేశా’’మని తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు