క్రికెట్‌ బెట్టింగ్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌..

22 Jun, 2021 11:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మేడ్చల్‌(హైదరాబాద్‌) : బాచుపల్లిలో క్రికెట్‌ బెట్టింగ్‌కి పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం.. ఈ ముఠా పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లపై ఒక్కో రేటు ఫిక్స్‌ చేసుకుని బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని అన్నారు.

ఈ గ్యాంగ్‌ బెట్టింగ్‌ను కొత్త తరహాలో చేస్తున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌తో..  ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ల ద్వారా బెట్టింగులు జరుగుతున్నాయని అన్నారు. కాగా ఈ ముఠా నుంచి రూ.21 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు.

చదవండి: ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య 

మరిన్ని వార్తలు