మొబైల్‌లో ‘ఫ్రీఫైర్‌ గేమ్‌’ ఆడనివ్వలేదని..

18 Oct, 2022 01:26 IST|Sakshi
ప్రశాంత్‌

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

పుట్టినరోజునే విషాదాంతం 

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): పుట్టిన రోజు వేడుకలను ఆనందంగా జరుపుకోవాల్సిన రోజే ఓ బాలుడు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.11 ఉదయ్‌నగర్‌ బస్తీలో నివసించే పోతరాజు ప్రశాంత్‌ (15) సమీపంలోని సరస్వతి హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు.

తండ్రి శ్రీనివాస్‌ కారు డ్రైవర్‌ కాగా, తల్లి స్వరూప అదే పాఠశాలలో ఆయాగా పని చేస్తున్నది. గత పది రోజుల నుంచి ప్రశాంత్‌ స్కూల్‌కు సరిగ్గా వెళ్లడం లేదు. సెలవులు అయిపోయిన తర్వాత కూడా స్కూల్‌కు వెళ్లకుండా తిరుగుతున్నావంటూ తల్లిదండ్రులు మందలించి ప్రశాంత్‌ నుంచి మొబైల్‌ఫోన్‌ను తీసేసుకు న్నారు. కాగా, సోమవారం తన పుట్టిన రోజు కావడంతో ప్రశాంత్‌ చాక్లెట్లు కొనుక్కోవడానికి తండ్రిని డబ్బులు అడగ్గా, రూ.200 ఇచ్చి అతను డ్యూటీకి వెళ్లిపోయాడు.

తల్లి కూడా స్కూల్‌కు వెళ్లింది. అయితే పుట్టిన రోజు నాడు మొబై ల్‌ఫోన్‌ దగ్గర లేకపోవడం, స్కూల్‌కు వెళ్లాలని తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి మొబైల్‌ ఫోన్‌లో ‘ఫ్రీఫైర్‌’అనే గేమ్‌ ఎక్కువగా ఆడే అల వాటు ఉందని, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాద ని పోలీసుల దర్యాప్తులో తేలింది. మొబైల్‌ ఫోన్‌ను తల్లిదండ్రులు లాక్కోవడంతో ప్రశాంత్‌ దిగాలుగా మారా డని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు