200 కిలోల గంజాయి పట్టివేత

13 May, 2022 23:42 IST|Sakshi
టోల్‌గేట్‌ వద్ద పోలీసులు పట్టుకున్న గంజాయి  

నక్కపల్లి: జాతీయరహదారిపై కాగిత టోల్‌గేట్‌ వద్ద గురువారం తెల్లవారు జామున పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఎస్‌ఐ డి.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం ఉదయం వాహనాలను తనిఖీలో భాగంగా విశాఖనుంచి తమిళనాడు వైపు వెళ్తున్న లారీలో కేబిన్, సీటు పైభాగంలో 100 ప్యాకెట్లలో ఉన్న 200 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా గోరిమేడుకు చెందిన డ్రైవర్‌ మహ్మద్‌ యూసుఫ్, క్లీనర్‌ ఖాదర్‌హుస్సేన్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.  

మోతుగూడెం చెక్‌పోస్టు వద్ద గంజాయి స్వాధీనం 
మోతుగూడెం: మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో  గంజాయి స్వాదీనం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ నుంచి సమాచారం మేరకు చింతూరు అడిషన్‌ ఎస్పీ కృష్ణకాంత్‌ ఆధ్వర్యంలో  చింతూరు సీఐ అప్పలనాయుడు పర్యవేక్షణలో ఎస్‌ఐ సత్తిబాబు చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు. 

సింధువాడ గ్రామంలో జహీరాబాద్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఒక ఇన్నోవా వాహనాన్ని ,మోటార్‌ బైక్‌ను, 350 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.  

మరిన్ని వార్తలు