విశాఖలో విషాదం, కుటుంబం ఆత్మహత్య

9 Sep, 2020 20:58 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఆశీల‌మెట్ట జంక్షన్‌ అశ్విని ‌లాడ్జిలో ఓ కుటుంబం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరి చిన్నారులతో పాటు భార్యా భర్తలిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.పెందుర్తి‌ మండలం బందపువానిపాలెంకి చెందిన బందం అప్పలరాజు కుటుంబంగా పోలీసులు గుర్తించారు.

ఆగస్టు 20న విశాఖపట్నానికి వచ్చిన అప్పలరాజు ఒక లాడ్జిలో రూమ్ తీసుకొని ఉన్నాడు.ఈ నేపథ్యంలో ఈనెల‌ ఒకటో తేదీన అప్పలరాజు తన కుటుంబాన్ని కూడా విశాఖపట్నంకు తీసుకువచ్చాడు. గత తొమ్మిది రోజులగా భార్య, కూతురు, కొడుకుతో కలిసి‌ లాడ్జిలోనే గడిపిన అప్పలరాజు బుధవారం కుటుంబంతో సహా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా సాయంత్రం సమయంలో రూమ్ బాయ్ వచ్చి తలుపులు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా అందరూ విగతజీవులై కనిపించారు.

వెంటనే బాయ్‌ హోటల్‌ మేనేజర్‌కు విషయం చెప్పగా.. అతను పోలీసులకు సమాచారం అందించాడు. ద్వారకా ఎసీపీ ఆర్ వీఎస్ఎన్ మూర్తి సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అప్పుల బాధతాళలేక కుటుంబం‌ మొత్తం ఆత్యహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా