అక్రమంగా గంజాయి రవాణా చేసే ముఠా అరెస్టు

15 Sep, 2020 19:50 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో కంచరపాలెం పోలీసుల స్టేషన్‌ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరివద్ద నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసే 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ శ్రవణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టు అయిన వారంతా  ఉత్తర భారతదేశానికి చెందిన వారని, ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి విశాఖ మన్యంలోని పలు ప్రాంతాల నుంచి గంజాయి సేకరిస్తున్నట్లు చెప్పారు.

దీన్ని ప్యాకెట్లుగా మార్చి గుట్టుగా రైళ్ల ద్వారా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఈ ఐదుగురు నిందితులు డిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు రైల్యే ఉద్యోగం చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. విశాఖ ఎజెన్సీ ప్రాంతాల నుంచి పశ్చిమ బెంగాల్‌కు గంజాయిని రైలులో తరలించే క్రమంలో వీరిని పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 30 వేల నగదు, 5 సెల్‌ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రవణ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు