పుణ్య స్నానాలు చేస్తూ..

16 May, 2022 02:01 IST|Sakshi

యాదాద్రి పుష్కరిణిలో మునిగి బాలిక మృతి

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయప్రాంగ ణంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గండి చెరువు వద్ద ఉన్న లక్ష్మీ పుష్కరిణిలో మునిగి ఒక బాలిక మృతి చెందింది. స్థానికులు, మృ తురాలి కుటుంబ సభ్యులు తెలిపి న వివరాలివి. హైదరాబాద్‌లోని మల్కా పూర్‌కు చెందిన బొంతల రోజా (15) తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం యాదాద్రీశుడి దర్శనానికి వచ్చింది.

మధ్యాహ్నం లక్ష్మీ పుష్కరిణిలో స్నానం చేస్తుండగా రోజా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు గమనించి రోజాను కాపాడే ప్రయత్నం చేశారు. భక్తులు సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్‌ వచ్చేటప్పటికి బాలిక మృతి చెందింది. ఫిట్స్‌ రావడంతో మృతి చెందినట్లు భక్తులు, పోలీసులు భావిస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణ పోలీసులు మృతదేహాన్ని పుష్కరిణి నుంచి బయటకు తీశారు.  ఆలయ సిబ్బంది పుష్కరిణిలో నీటిని తరలించి సంప్రోక్షణ చేశారు. 

మరిన్ని వార్తలు