780 కేజీల గంజాయి పట్టివేత 

19 May, 2022 23:05 IST|Sakshi
పట్టుకున్న గంజాయితో ఎస్‌ఈబీ పోలీసులు  

వాహన యజమానిపై కేసు నమోదు

గొలుగొండ: గొలుగొండ ఎస్‌ఈబీ పోలీసులు బుధవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మండలంలో మారుమూల గ్రామం నిమ్మగెడ్డలో బలోరా వ్యాన్‌లో తరలించడం కోసం దాచి ఉంచిన 780 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఇంత పెద్ద మొత్తంలో గంజాయి దొరకడం ఇదే మొదటిసారి.  ఏజెన్సీ నుంచి బలోరా వ్యాన్‌లో 38 బ్యాగ్‌ల్లో 780 కేజీల గంజాయి రవాణాకు సిద్ధంగా ఉంది.

ఆ సమయంలో పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గొలుగొండ ఎస్‌ఈబీ సీఐ రాజారావు, ఎస్‌ఐ గిరి మాట్లాడుతూ ఇటీవల గంజాయి రవాణా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఒక్కో బ్యాగ్‌లో 20 కేజీల చొప్పున 38 బ్యాగ్‌ల్లో గంజాయి తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో దాడి చేశామని తెలిపారు.

బలోరా వ్యాన్‌ మాత్రమే నిమ్మగెడ్డ పరిసర ప్రాంతాల్లో ఉందని వాహనంలో ఎవరూ దొరకకపోవడంతో వ్యాన్‌ యజమానిని గుర్తించి అతనిపై కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. గంజాయిని, వాహనాన్ని సీజ్‌ చేశామన్నారు.   

రూ 3లక్షల విలువైన గంజాయి స్వాధీనం
నాతవరం : వాహనాలు తనిఖీలు చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.3 లక్షల విలువ చేసే గంజాయి పట్టుబడిందని నాతవరం ఎస్‌ఐ దుంçపల శేఖరం తెలిపారు. ఆయన బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు నర్సీపట్నం తుని మధ్య డి.యర్రవరం జంక్షన్‌లో బుధవారం వాహనాలు తనిఖీలు చేస్తుండగా తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ముందు బైక్‌ దాని వెనుక కారును వదిలి నిందితులు పరారయ్యారని తెలిపారు.

దీంతో కారులో సోదా చేయగా 80 కేజీలు గంజాయి లభ్యమైందన్నారు. బైక్‌ను, కారును పోలీసుస్టేషన్‌కు తరలించామన్నారు. బైక్, కారు తెలంగాణ రాష్ట్రానికి చెందినవిగా గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.3 లక్షలకు పైగా ఉంటుందన్నారు.  

మరిన్ని వార్తలు