ఖమ్మం ఆర్వోబీపై నుంచి కిందపడ్డ కారు

23 May, 2022 01:29 IST|Sakshi
ఆర్వోబీపై నుంచి కింద పడిపోయిన కారు 

భార్యాభర్తలు దుర్మరణం 

కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. దంపతుల వాహనాన్ని ఢీకొట్టిన వైనం 

దంపతుల కారు డ్రైవర్‌ పరిస్థితి విషమం

వరంగల్‌ క్రైం: ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం భార్యాభర్తల మృ తికి కారణమైంది. ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టడంతో సుమారు 40 అడుగుల ఎత్తునుంచి దంపతులు ప్రయాణిస్తున్న కారు కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మరణించగా, భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరి కా రు డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది.

హంటర్‌రోడ్డు ఖమ్మం ఆర్వోబీపై ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా హుజూరాబాద్‌ మండలం రాజపల్లి గ్రామానికి చెం దిన దంపతులు తాడూరి సారయ్య(55) సుజాత(54)లు ఖమ్మంలోని గట్టయ్య సెంటర్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం సొంతకారులో ప్రైవేటు డ్రైవర్‌ ఖా సీం అలీను పెట్టుకుని ఖమ్మం నుంచి బయల్దేరి వరం గల్‌ వైపు వస్తున్నారు. సరిగ్గా హంటర్‌రోడ్డు ఖమ్మం ఆర్వోబీ పై చేరుకునే సరికి వరంగల్‌ నుంచి ఖమ్మం వైపు వేగంగా వస్తున్న కారు వీరి కారును బలంగా ఢీకొట్టింది.

దీంతో సారయ్య దంపతుల కారు ఆర్వోబీపై నుంచి కిందపడిపోవడంతో భార్య సుజాత అక్కడికక్కడే దుర్మరణం పాలైం ది. తీవ్ర గాయాలైన సారయ్యను 108 వాహనంలో సమీపంలోని ఎంజీఎంకు తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్‌ ఖాసీం అలీ పరిస్థితి విషమంగా ఉంది. సారయ్య కుమారుడు వినయ్‌ భాస్కర్‌ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు