వామ్మో! భర్త 8 హత్యలు.. భార్య 11 హత్యలు

29 Jul, 2021 10:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుండిగల్‌లో వరుస హత్యలకు పాల్పడుతున్న దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిస్సింగ్‌ ఫిర్యాదుతో ఈ క్రూర దంపతులు పోలీసులకు పట్టుబడ్డారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన స్వామి(27) ఈనెల 25న మల్లంపేటలోని కూలీ అడ్డా నుండి భామిని(35)అనే మహిళను జిన్నారం అడవుల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ భార్యతో కలిసి ఆమెను హత్య చేశాడు. స్వామిపై అనుమానంతో అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో పోలీసులు విచారించారు. దీంతో మాదారం గుట్టలల్లో ఉన్న మహిళ మృతదేహాన్ని చూపించాడు. భార్యాభర్తలిద్దరూ బంగారం కోసం 15 మందికి పైగా మహిళలను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. భర్త 8 హత్యలు భార్య11 హత్యలు చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు