అర్జంట్‌ అని బాత్రూమ్‌కు వెళ్లాడు, కిటికీలో నుంచి దూకే క్రమంలో..

21 Apr, 2021 11:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నొయిడా:‌ పోలీసుల నుంచి త‌ప్పించుకునే ప్రయత్నంలో ఓ క్రిమినల్ రెండో అంత‌స్థులో ఉన్న‌ బాత్రూమ్‌ కిటికీలో నుంచి దూకాడు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో జ‌రిగింది. ఇటీవల పోలీసులపైకి కాల్పులకు తెగబడిన మహ్మద్ ఇమ్రాన్ కోసం పోలీసు శాఖ తీవ్రంగా గాలిస్తోంది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఇమ్రాన్‌ గ్రేట‌ర్ నోయిడాలోని ఒమైక్రాన్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. దీంతో నేరస్థుడి ఉన్న ఇంటిపై పోలీసులు దాడి చేయగా ఇమ్రాన్ ఇద్ద‌రు బామ్మ‌ర్దులు ల‌క్మాన్‌, చాంద్ మ‌హమ్మ‌ద్‌లు పట్టుబడ్డారు.

వారిని ఇమ్రాన్‌ ఆచూకీ కోసం విచారణ చేస్తుండగా.. చాంద్ మ‌హ‌మ్మ‌ద్ బాత్రూమ్‌కు వెళ్లాలని పోలీసులకు చెప్పి అక్కడి నుంచి త‌ప్పించుకునేందు‌కు ప్రయ‌త్నించాడు. బాత్రూమ్‌ కిటికీలో నుంచి కిందికి దూకాడు. అయితే చాండ్‌ ఉన్నది రెండో అంత‌స్థు కావడంతో కింద‌ప‌డి తీవ్రం గాయాల‌ పాలయ్యాడు. పోలీసులు అత‌డిని హుటాహుటిన  ఆస్పత్రికి త‌ర‌లించ‌గా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడని గ్రేట‌ర్‌ నోయిడా డీసీపీ రా‌జేష్ కుమార్ సింగ్ తెలిపారు. చాంద్‌ పై డ‌జ‌నుకు పైగా దొమ్మి, హ‌త్య కేసులు ఉన్నాయ‌ని, ఇన్‌స్పెక్ట‌ర్ అక్త‌ర్ ఖాన్ హ‌త్య కేసులో కూడా అత‌డు ప్ర‌ధాన నిందితుడ‌ని వెల్ల‌డించారు.

( చదవండి: జువైనల్‌ హోం నుంచి యువతి పరార్‌.. )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు